Can Refusing Physical Relationship Become a Ground for Divorce?

Disclaimer: The names used in this article have been changed to protect privacy. This article is intended only for general legal awareness and should not be treated as legal advice.



Suresh and Bhavana got married according to Hindu customs. Their families were happy and hoped they would lead a peaceful married life together.

However, according to Suresh, Bhavana repeatedly refused to maintain a normal marital phyical relationship with him. Whenever he tried to discuss the issue, she avoided the conversation.

Suresh did not immediately think about divorce. He tried to save the marriage. He spoke with family elders and hoped that things would improve with time.

Months passed. Then years passed.

According to Suresh, there was no medical problem or any reasonable explanation for the continued refusal. He felt emotionally hurt, lonely, and mentally disturbed.

Eventually, Suresh approached the Family Court seeking divorce on the ground of mental cruelty.

Whenever such cases come before the Court, various factors are examined, such as:

– Was the refusal continuous and for a long period?
– Was there any genuine medical or other reasonable cause?
– What was the overall conduct of both spouses?
– Did the conduct result in serious mental suffering to the other spouse?

It is important to understand that every disagreement between husband and wife does not become a ground for divorce. Each case is decided based on its own facts and evidence.

Marriage is built on mutual respect, trust, understanding, and companionship. Whenever disputes arise, efforts should be made to resolve them with patience and communication.





గమనిక: ఈ కథలో ఉపయోగించిన పేర్లు వ్యక్తుల గోప్యత కోసం మార్చబడ్డాయి. ఈ వ్యాసం కేవలం చట్టపరమైన అవగాహన కోసం మాత్రమే. దీనిని న్యాయ సలహాగా పరిగణించరాదు.

సురేష్ మరియు భావన హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆనందంగా వారి దాంపత్య జీవితం సుఖంగా సాగాలని ఆశించారు.

అయితే, సురేష్ చెప్పిన ప్రకారం, భావన అతనితో సాధారణ దాంపత్య సంబంధాలను కొనసాగించడానికి పదేపదే నిరాకరించేది. ఈ విషయం గురించి మాట్లాడాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె ఆ విషయాన్ని తప్పించుకునేది.

సురేష్ వెంటనే విడాకుల గురించి ఆలోచించలేదు. వారి వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. కుటుంబ పెద్దలతో మాట్లాడాడు. కాలక్రమేణా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశించాడు.

నెలలు గడిచాయి. తరువాత సంవత్సరాలు కూడా గడిచాయి.

సురేష్ చెప్పిన ప్రకారం, అలాంటి నిరాకరణకు ఎలాంటి వైద్యపరమైన సమస్యగానీ, సరైన కారణంగానీ తెలియలేదు. దీంతో అతను మానసికంగా బాధపడ్డాడు.

చివరికి, సురేష్ మానసిక క్రూరత్వం కారణంగా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

ఇలాంటి సందర్భాల్లో కోర్టు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తుంది:

– నిరాకరణ ఎంతకాలం కొనసాగింది?
– దానికి వైద్యపరమైన లేదా ఇతర సరైన కారణం ఉందా?
– భార్యాభర్తల మొత్తం ప్రవర్తన ఎలా ఉంది?
– ఆ ప్రవర్తన వల్ల మరో జీవిత భాగస్వామికి తీవ్రమైన మానసిక వేదన కలిగిందా?

భార్యాభర్తల మధ్య జరిగే ప్రతి చిన్న గొడవ లేదా అభిప్రాయ భేదం విడాకులకు కారణం కాదని గుర్తుంచుకోవాలి. ప్రతి కేసు దాని ప్రత్యేక పరిస్థితులు మరియు ఆధారాల ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.

వివాహం అనేది పరస్పర గౌరవం, అవగాహన, నమ్మకం మరియు సహజీవనంపై ఆధారపడి ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఓపికతో, పరస్పర సంభాషణ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించడం అవసరం.

గమనిక: ప్రతి కుటుంబ వివాదం దాని ప్రత్యేక పరిస్థితులు మరియు ఆధారాల ఆధారంగా నిర్ణయించబడుతుంది.

jytho3

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top